రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు

cm kcr
cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడతు ఐదు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఉత్సాహంతో ఆరో వసంతంలోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు అన్నారు. దేశ చరిత్రలో అపూర్వ మహోద్యమాన్ని సాగించి స్వరాష్ట్రం సాదించుకున్నాం సాధించుకున్న తెలంగాణ ప్రగతిపథంలో పరుగులుపెడుతుంది అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉంది. తొలి ఐదేళ్లలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన, సరైన అడుగులు పడ్డాయి. ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శకమైన పాలన చిత్తశుద్ధితో అందిస్తున్నాం. ప్రభుత్వ ప్రయత్నంలో ప్రజలు కూడా విస్తృతంగా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.స్వరాష్ట్ర స్వప్నం సాకారం కావడంతో అమరులైన వీరులకు సీఎం నివాళులర్పించారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/