బాలసుబ్రహ్మణ్యం లేని లోటు తీరనిది..సిఎం కెసిఆర్‌

సినీ రంగానికి బాలు బహుముఖ సేవలందించారన్న కెసిఆర్‌

cm kcr – sp-balasubrahmanyam

హైదరాబాద్‌: గానగంధర్వుడు, సినీ సంగీతాన్ని తన గాత్రంతో మరోస్థాయికి తీసుకెళ్లిన గాయక దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లడంపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ స్పందించారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినా, తమ అత్యుత్తమ సేవలు అందించినా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కాపాడలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాలు సినీ ప్రపంచంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అత్యుత్తమ రీతిలో సేవలందించారని కొనియాడారు. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు సిఎం కెసిఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/