నేడు మానుకోట, ఖమ్మంలో కెసిఆర్‌ సభలు

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మహబూబాబాద్‌, ఖమ్మం బహిరంగసభల్లో పాల్గొననున్నారు. మహబూబాబాద్‌ జల్లా కేంద్రంలోని ఇల్లందురోడ్డు మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సిఎం కెసిఆర్‌ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిఎం మహబూబాబాద్‌ చేరుకుంటారు. అనంతరం కెసిఆర్‌ ఖమ్మం జిల్లాకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావుకు మద్దతుగా జరిగేసభలో సిఎం కెసిఆర్‌ పాల్గొంటారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/