రాంపూర్‌లో పర్యటిస్తున్న సిఎం కెసిఆర్‌

kcr
kcr

జగిత్యాల: తెలంగాణ సిఎం కెసిఆర్‌ జిల్లాలోని రాంపూర్‌ చేరుకుని అక్కడ పంప్‌హౌస్‌ పనులను పరిశీలిస్తున్నారు. మోటర్ల బిగింపు పనుల పురోగతిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్ వద్ద 24 గంటలు మూడు షిఫ్ట్‌ల్లో పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే ఒక మోటర్ డ్రైరన్ సక్సెస్ అయిందని అధికారులు వివరించారు. రెండో మోటరు పనులు చివరిదశలో ఉన్నాయి. ఈ నెలాఖరుకు నాలుగింటిని సిద్ధంచేసే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి గంటలకు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలిస్తారు. అనంతరం సీఎం అక్కడే అధికారులతో సమీక్షిస్తారని సమాచారం. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంకానున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/