కలెక్టర్ల నిధులు మంత్రులకు బదలాయిస్తాం!

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ సోమవారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతు కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాల ఆమోదం కోసం త్వరలో శాసనసభా సమావేశాలు నిర్వహిస్తాం, జిల్లాలో మంత్రులకు సర్వాధికారాలు ఇస్తాం, కలెక్టర్ల వద్దనున్న నిధులను మంత్రులకు బదలాయిస్తాం. జిల్లాల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యెలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రస్తుతం ప్రజలకు ఉన్న అతిపెద్ద సమస్య అవినీతి. దానిని పూర్తిగా నిర్మూలిస్తాం. వచ్చే రెవెన్యూ చట్టం పటిష్టంగా ఉంటుంది. ఉద్యోగులు ధర్నాలు చేసిన వెనక్కి తగ్గేది లేదు. పురపాలక చట్టం కూడా ప్రజలకు అన్ని విధాల మేలు చేస్తుంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే ఒక్క రూపాయి ఇవ్వకుండా పని జరగాలి. హైదరాబాద్‌ మహానగరానికి ప్రత్యేక చట్టాన్ని తెస్తాం. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు. వాటికీ అడ్డుకట్ట వేయాలి.కెసిఆర్‌ తెలిపారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలను
టిఆర్‌ఎస్‌ కచ్చితంగా గెలుస్తుందన్నారు. ఎన్నికలపై నిర్వహించిన 10 సర్వే నివేదికలన్నీ ఇదే విషయాన్ని వెల్లడించాయని తెలిపారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత దిల్లీలో చక్రం తిప్పేది తామేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 32 జిల్లా పరిషత్‌లను, 530 మండల పరిషత్‌ పీఠాలను కైవసం చేసుకుంటామని వెల్లడించారు. 535 జడ్పీటీసీ, 5,857 ఎంపీటీసీ స్థానాలు టిఆర్‌ఎస్‌ ఖాతాలోనే పడాలన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసి టికెట్లు ఇచ్చేది ఎమ్మెల్యేలేనని, మంత్రుల ఆమోదంతో ఇద్దరూ కలిసి జాబితాలను ఖరారు చేయాలన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఉద్యమకారులకు ప్రాధాన్యమివ్వాలన్నారు.మంత్రుల ఆమోదంతో జాబితాల ఖరారు ఆసిఫాబాద్‌ జడ్పీకి కోవా లక్ష్మి, పెద్దపల్లికి పుట్ట మధు పేర్ల ఖరారు ఈ సందర్భంగా ఆయన దాదాపు రెండున్నర గంటల పాటు మంత్రులు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/