తెలంగాణ అంతటా టిఆర్‌ఎస్‌కే అనుకూలం

మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌

CM KCR
CM KCR

హైదరాబాద్‌: తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు అధిక ప్రాధాన్యత ఉందని పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ గెలుపు తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సిఎం కెసిఆర్‌ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆశావహుల నుంచి గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. అయితే అందరికీ అవకాశం ఇవ్వలేం కాబట్టి టికెట్టు దక్కనివారు నిరాశ పడకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని సిఎం కెసిఆర్‌ చెప్పారు. టికెట్‌ రాని వారు బాధపడాల్సిన పనిలేదని, భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు, ఇతర అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపుకు ఎమ్మెల్యేలంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కృషి చేయాలని సిఎం కెసిఆర్‌ దిశానిర్దేశం చేశారు. కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులకు ఇవ్వాల్సిన ఏ, బి ఫారాలను ఎమ్మెల్యేలకు సిఎం కెసిఆర్‌ అందజేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/