పద్మ అవార్డు గ్రహీతలకు సిఎం అభినందనలు

cm kcr
cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రతిష్టాత్మకమైన పద్మఅవార్డులను గెల్చుకున్న తెలంగాణ రాష్ర్టానికి చెందిన పలువురు ప్రముఖులను అభినందించారు. ప్రత్యేకించి షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆమె పద్మభూషణ్‌ గెల్చుకోవడం పై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. వ్యవసాయంలో వినూత్న పద్దతుల్ని పాటించి పేరు తెచ్చుకుని పద్మ అవార్డుకు ఎంపికైన రైతు చింతల వెంకట్‌రెడ్డి, సంస్కృతంలో స్కాలర్‌ విజయసారధి శ్రీభాష్యంను కూడా ముఖ్యమం అభినందించారు. తమ తమ రంగంలో వ్యక్తిగతంగా ప్రత్యేకతలు చాటుకుంటూ సేవలు అందించిన వీరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. వారంతా ఇతరులకు స్పూర్తిగా నిలిచారని అన్నారు. ఆయా రంగాల్లో సేవలు అందించి పద్మఅవార్డు గెల్చుకున్న దేశంలోని ఆయా ప్రాంతాల వారికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/