చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి

cm kcr- cmd Rajiv Sharma
cm kcr- cmd Rajiv Sharma

హైదరాబాద్: అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసర ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభిలషించారు. దేశంలో ప్రస్తుతమున్న స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని, ఇంకా చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయని, దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయని సిఎం అన్నారు. ఈ పరిస్థితి పోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పి.ఎఫ్. సి.) సిఎండి రాజీవ్ శర్మ ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై చర్చ జరిగింది. జెన్ కో, ట్రాన్స్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రా వు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శ ర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింరావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/