సింగ‌రేణిలో కారుణ్య నియామకాలపై సిఎం ‌వివరణ

cm kcr

హైదరాబాద్‌: అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల సంద‌ర్భంగా సిఎం కెసిఆర్‌ వివరణ ఇచ్చిరు. రిటైర్డ్ ఉద్యోగులు, కారుణ్య నియామకాలపై త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల గురించి మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. ఏళ్ల పాటు సర్వీసులో ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ చేసేటప్పటికి స్కేల్ ఎంత, ఎంత వస్తుంది, రిటైర్డ్ అయ్యే రోజు ఎంత వస్తుందో లెక్కలు పూర్తయ్యి ఉండాలన్నారు. రిటైర్ అయిన సింగ‌రేణి కార్మికుల‌ను గౌర‌వించాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి రోజునే అన్ని ఇచ్చి గౌర‌వంగా పంపాలి అని సిఎం సూచించారు.

అలాగే ఓ ఉద్యోగి పదవీ విరమణ చేశాక.. కృతజ్ఞతాపూర్వకంగా సన్మానం చేసి, ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేర్చాలన్నారు. వీటన్నిటిపై సమగ్ర విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని సిఎం కెసిఆర్‌ పేర్కొన్నారు. సింగ‌రేణి కార్మికుల‌కు ఇన్‌కం ట్యాక్స్ ర‌ద్దు చేయాల‌ని ప్ర‌ధాని మోడిని అనేక‌సార్లు కోరామ‌ని తెలిపారు. కేంద్రం పట్టించుకోవ‌డం లేదు. సింగ‌రేణి కార్మికుల స‌మ‌స్య‌ల‌న్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/