భారీ వర్షాలపై సిఎం కెసిఆర్‌ సమీక్ష

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఆయా జిల్లాల అధికారులకు తగు సూచనలు చేశారు. భారీ వర్షాలతో అనేక చెరువులు అలుగుపోస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో 2 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, మంత్రులు జిల్లాల్లోనే ఉండి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని అధికారులు.. మరింత అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/