కోడెల నివాసంలో క్లూస్‌ టీం తనిఖీలు

Clues team in Kodela's House
Clues team in Kodela’s House

Hyderabad: టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ అసెంబ్లి మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లిహిల్స్‌లోని కోడెల నివాసంలో క్లూస్‌ టీం తనిఖీలు నిర్వహించింది. ఆధారాల కోసం డీసీపీ శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీలు కోడెల ఇంటిని పరిశీలించారు. కోడెల బెడ్‌రూంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ శివప్రసాద్‌ ఉదయం తన బెడ్‌రూంలో కిందపడిన స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. కోడెల కిందపడి పోయి ఉంటే భార్య, కుమార్తె, డ్రైవర్‌ కలిసి బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లారని, అక్కడ వైద్యులు కోడెలను బతికించడానికి ప్రయత్నించారన్నారు. కాసేపటి తర్వాత కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. శివప్రసాద్‌ మెడమీద స్వల్ప గాయం కనిపిస్తోందన్నారు. ఇంట్లో ఎలాంటి సూసైడ్‌ లేఖలు లభించలేదన్నారు. కోడెల ఇంట్లో ప్రస్తుతం ఆయన భార్య, కుమార్తె, పనిమనిషి మాత్రమే ఉన్నారన్నారు. కోడెల మృతిపై సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేశామన్నారు. కొన్ని రోజులుగా ఆయన ఒత్తిడిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారన్నారు.