సీఎల్పీ విలీనం రాజ్యాంగ బద్ధమే!

టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే రేగా కాంతారావు

rega kantharao
rega kantharao

హైదరాబాద్‌: సీఎల్పీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడం రాజ్యాంగ బద్దమేనని కాంగ్రెస్‌ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీని విభేదించి టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భవిష్యత్‌ పై నమ్మకం లేకే పార్టీ మారామని, రాజ్యాంగ కల్పించిన హక్కు ప్రకారమే సీఎల్పీని విలీనం చేయాలని కోరామని అన్నారు. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోలేక పోయిందని ఎద్దేవా చేశారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/