నిజామాబాద్‌లో చెడ్డీగ్యాండ్‌ హల్‌ చల్‌

Cheddi-Gang
Cheddi-Gang

నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగరంలో ముబారక్‌నగర్‌ చెడ్డీ గ్యాంగ్‌ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నించి తలుపు తీయలంటూ ఇంట్లో వాళ్లను బెదిరింపులకు గురిచేశారు. రెండు గంటలకు పైగా ఇంటివద్ద హల్‌ చల్‌ చేశారు. ఇంటి తలుపులు, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. మరో ఇంట్లో అయితే భార్యభర్తలను బెదిరించి, వారిని మంచానికి కట్టేసి పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. చుట్టుపక్కల వారు రావడంతో చెడ్డీ గ్యాంగ్‌ అక్కడి నుండి పరారయ్యారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/