టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నాలుగు చార్జిషీట్లు దాఖలు

drugs case
drugs case


హైదరాబాద్‌: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 12 కేసుల్లో ఇప్పటి వరకు 4 కేసుల్లో చార్జిషీటు దాఖలు చేసిన సిట్‌ మరో 8 కేసుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు సందర్భంగా మొత్తం 62 మంది నటీ నటులు, దర్శకులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారించినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించినట్లుగా పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/