పబ్లిసిటీ కోసం చంద్రబాబు డ్రామాలు

talasani srinivasa yadav
talasani srinivasa yadav, telangana minister


హైదరాబాద్‌: ఏపి సియం, చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. పోలింగ్‌ సరళిపై మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో 16 ఎంపి సీట్లు టిఆర్‌ఎస్‌ గెలవబోతున్నదని అన్నారు. ఓటేసిన ప్రజలకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపిలో ఎన్నికల తీరుపై మాట్లాడుతూ..పోలింగ్‌పై టిడిపి డ్రామాలాడుతుందని, పబ్లిసిటీ కోసం ఎన్నికల ప్రచారం తర్వాత చంద్రబాబు ఈసిని కలిశాడని, ఏపి ఎన్నికల్లో దాదాపు 42 వేల ఈవిఎంలు వాడితే అందులో 300 ఈవిఎంలలో సమస్యలు తలెత్తాయి. ఈవిఎంలపైనే టిడిపి భవిష్యత్‌ ఆధానపడి ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలని, నోరు తెరిస్తే అబద్ధాలేనని, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అని చంద్రబాబును దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాల మధ్యచిచ్చు పెట్టాలని చంద్రబాబు పన్నాగం అని మంత్రి ఆరోపించారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos