గవర్నర్‌ నరసింహన్‌తో చంద్రబాబు సమావేశం

chandra babu, narasimhan
chandra babu, narasimhan


హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భేటి అయ్యారు. రాజ్‌భవన్‌కు ఈ ఉదయం చేరుకున్న చంద్రబాబు గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయాల పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది. చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ రెండు రోజుల్లో పార్టీ నేతలతో తెలంగాణ రాజకీయపరిస్థితులపై సమావేశం కానున్నారు. గురువారం రాత్రి చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ కూడా హైదరాబాద్‌ చేరుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/