మీ అందరి ఆశీస్సులతో కేంద్ర మంత్రి పదవి

Centra Minister Kishan Reddy

Hyderabad: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడ విఠల్‌వాడలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సులతో కేంద్ర మంత్రి పదవి వచ్చిందన్నారు. శని, ఆదివారాల్లో ప్రజలను కలవాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఉగ్రవాదుల నిర్మూలన విషయంలో అన్ని చర్యలు చేపడుతామన్నారు.