గచ్చిబౌలి వద్ద కారు ప్రమాదం..ముగ్గురు మృతి

9 మందికి తీవ్రగాయాలు

Car-Accident
Car-Accident

హైదరాబాద్‌: హైదరాబాదులోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు అతివేగమే కారణమని ప్రత్యక్షసాక్షుల కథనం. ఫ్లైఓవర్ పైనుంచి దూసుకువచ్చిన కారు కింద ఉన్న మరో రెండు కార్లపై పడింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.​

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/