హెచ్ఎండీఏ పరిధిలో భూముల విక్రయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

TS CM KCR

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. హెచ్ఎండీఏ పరిధిలో భూముల విక్రయానికి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూముల విక్రయం ద్వారా రూ.10వేల కోట్లు రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉప్పల్ భగాయత్ తరహాలో ల్యాండ్ పూలింగ్ పై మంత్రివర్గంలో చర్చించారు.

28న రెవెన్యూ సమ్మేళనం 

ఈనెల 28న శంషాబాద్ లో రెవెన్యూ సమ్మేళనం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ చట్ట సవరణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/