బయెడైవర్సిటీ వంతెనను తిరిగి తెరిచేది అప్పుడే

biodiversity flyover
biodiversity flyover

హైదరాబాద్‌: నగరంలోని మైండ్‌స్పేస్‌ వద్ద గల బయెడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ గురించి ఇప్పుడు తెలియని వారుండరు. గత నెల 23 వతేదీన జరిగిన ప్రమాదంలో అతివేగంగా వచ్చిన కారు వంతెన పైనుంచి ఓ మహిళపై పడింది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. కాగా విషయాన్ని సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రమాదాల నివారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు చర్యలు చేపట్టారు. వంతెన సమీపానికి ముందు, ప్రారంభమయ్యాక తెలుపు చారలతో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వాహనం వీటిపై నుండి వెళ్లే క్రమంలో కుదుపులకు గురవుతుంది. అలాగే వేగాన్ని నియంత్రించేందుకు హెచ్చరికల బోర్డులను పెట్టారు. అంతేకాకుండా ప్రమాదకరంగా ఉన్న మలుపు దగ్గర రక్షణ గోడ ఎత్తు పెంచాలని కమిటీ సూచించగా, ఈ గోడ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. పని పూర్తి చేసిన అనంతరం తిరిగి వంతెనను ఎప్పుడు ప్రారంభిచేది నిర్ణయిస్తామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/