తెలంగాణ జన సమితికి బాక్సు గుర్తు

Telangana Jana Samithi party
Telangana Jana Samithi party

ఢిల్లీ: ఈ ఎన్నికల సందర్భంగా తెలంగాణ జన సమితి (తెజస)కి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం బాక్సు గుర్తు కేటాయించింది. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ చేయించుకున్న 76 పార్టీలకు గుర్తులు కేటాయింపు జరిగింది. వాటిలో అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తెలంగాణలోని 10 స్థానాలకు బ్యాాాట్‌మెన్‌, ఏపీలోని 13 స్థానాలకు ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గుర్తు మంజూరు చేసింది. భారతీయ రాష్ట్రీయ మోర్చాకు తెలంగాణలోని 16 స్థానాలకు బెంచ్‌ గుర్తు, మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు తెలంగాణలోని 4 లోక్‌సభ స్థానాలకు కంప్యూటర్‌ కేటాయించింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/