బిజేవైఎం నేతల అరెస్టు

arrested
arrested

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా ప్రగతిభన్‌ ముట్టడకి బిజెపి యువమోర్చ(బీజేవైఎం) కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్‌ల్యాండ్స్‌ చౌరస్తాతో పాటు సిఎం క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పలువురు బిజేవైఎం నాయకులను అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వీరందరు కూడా సిఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేస్తు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని యువమోర్చా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. అరెస్టయిన వారిలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భరత్‌కుమార్‌ ఉన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/