2023 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు!

shiv raj singh chouhan
shiv raj singh chouhan

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోది, హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో బిజెపి ముందుకెళ్తుందని మధ్యప్రదేశ్‌ మాజీ సియం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. బిజెపికి మద్దతు పలికినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యావాదాలు తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా శివరాజ్‌సింగ్‌ మాట్లాడుతూ..అన్ని రంగాల వారిని బిజెపిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. జూలై 6న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోది ప్రారంభిస్తారన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలకు కాలం చెల్లిందన్న ఆయన, కేసిఆర్‌కు తెలంగాణ అభివృద్ధిపై ధ్యాస లేదని విమర్శించారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/