తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం

బిజెపిని టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారు

K. Laxman
K. Laxman

హైదరాబాద్‌: బిజెపిని టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌లపై విమర్శల వర్షం కురిపించారు. కెసిఆర్‌ భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. కెసిఆర్‌ను మించిన నియంత దేశంలోనే ఎవ్వరూ లేరని లక్ష్మణ్‌ విమర్శించారు. కెసిఆర్‌ అవినీతి పాలనపై ఉద్యమించి ప్రజలకు చేరువవుతామని చెప్పారు. మేం ఫిర్యాదులు చేస్తే మంత్రులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకా నిజామాబాద్‌లో మూడో స్థానంలో ఉన్న టిఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగంతో మేయర్‌ పీఠాన్ని దక్కించుకుందని దుయ్యబట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/