కెసిఆర్‌ పగటికలలు కంటున్నారు

Laxman
Laxman

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ఎంపిలు కేంద్రంలో మంత్రులు అవుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. సిఎం పగటికలలు కంటున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని మోడి అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్‌ విసిరానని దానికి టిఆర్‌ఎస్‌ స్పందనలేదని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్‌ నేతలల్లో అంతర్మథనం ప్రారంభమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదరబాదరగా వెళ్తున్నారని, సిఎం కెసిఆర్‌ తుగ్గక్‌ మాదిరిగా వ్యవహారిస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. పార్టీ కార్యవర్గ సమావేశాలు జరిపి స్థానిక సంస్థల అభ్యర్థులను ఎన్నుకుంటామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రేపు పదాధికారులు, జిల్లా ఇన్‌ఛార్జీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఇందులో ఎన్నికలపై చర్చిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/