18న నాంపల్లిలో బిజెపి బహిరంగ సభ

Laxman
Laxman


హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఈనెల 18న బిజెపి బహిరంగ నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. ఈ బహిరంగ సభకు బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. ఆ సభలోనే టిడిపి, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు బిజెపి లో చేరనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ను గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తమతో భాగస్వామ్యమయ్యేందుకు కలిసే వచ్చే నేతలను స్వాగతిస్తామని లక్మణ్‌తో వివరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/