ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ధ్వజమెత్తిన కిషన్‌ రెడ్డి

ఎంఐఎంతో స్నేహం చేస్తూ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ మండిపాటు

kishan reddy
kishan reddy

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బిజెపి సినీయర్‌ నేత కిషన్‌ రెడ్డి బెల్లంపల్లిలో ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఎంఐఎంతో స్నేహం చేస్తూ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల భైంసాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ బాధ్యత వహించాలని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ, నిరంకుశ, పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎక్స్‌్‌ప్రెస్‌లో బెల్లంపల్లి చేరుకున్న కిషన్‌ రెడ్డి బెల్లంపల్లిలో మున్పిపాలిటీ ఎన్నికల ప్రచారం తర్వాత మధ్యాహ్నం నుంచి చెన్నూరు, గోదావరి ఖని, రామగుండం ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/