కెసిఆర్‌పై నిప్పులు చెరిగిన ఇంద్రసేనారెడ్డి

B J P Leader Indrasena Reddy
B J P Leader Indrasena Reddy

హైదరాబాద్‌: గవర్నర్ గా ప్రమాణ స్వీకరం చేసి 24 గంటలు కూడా గడవకముందే తమిళి సై సౌందరరాజన్‌ పై, ముఖ్యమంత్రి కెసిఆర్‌, తన కనుసన్నలలో కించపరిచే వ్యాసాలు రాయించారని
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి నిప్పులు చెరిగారు. స్వయంగా సీఎం సీపీఆర్‌ఓ, గవర్నర్ పై విషం కక్కేలా వార్తలు రాయించారని ఆరోపించిన ఆయన, వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలని, లేకుంటే క్రిమినల్‌ కేసు పెడతామని అన్నారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ, రాజ్యాంగ బద్ధమైన పదవిని అవమానించేలా ఆయన ప్రవర్తించారని అన్నారు. గవర్నర్‌ ను కించపరిచేలా వ్యాసం రాసి, దాని చివరన ‘ఇది నా సొంత అభిప్రాయం’ అని రాయించారని అన్న ఇంద్రసేనా రెడ్డి, గవర్నర్‌ పదవిని వారు అవమానించారని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయించినందుకు కెసిఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ పై నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలు, ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ లో అసమ్మతి బయటకు వస్తోందని, మొన్న ఈటల, నిన్న రసమయి, నేడు నాయిని, రాజయ్య, జోగు రామయ్యలు తమ బాధను బయట పెట్టారని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/