రాష్ట్రంలో అవినీతికి అదుపు లేకుండా పోయింది

కెసిఆర్‌ ప్రభుత్వం అవినీతిలో నెంబర్ వన్‌

Laxman
Laxman

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ప్రభుత్వం అవినీతిలో నెంబర్‌ వన్‌గా తేలిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రజా సేవలు అందించాల్సిన ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారన్నారు. కాళేశ్వరాన్ని మానస పుత్రికగా చెప్పుకొనే కెసిఆర్‌ రూ.30వేల కోట్ల ప్రాజెక్టును రూ. లక్ష కోట్లకు పెంచి 6 శాతం కమీషన్ దండుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో కమీషన్ తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబును బూచిగా చూపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని దుయ్యబట్టారు. రూ.500 కోట్లు వృథా చేసి అసెంబ్లీ కడతామంటూ చెబుతున్న కెసిఆర్‌ .. ఆరోగ్యశ్రీ బకాయిలు మాత్రం చెల్లించట్లేదు. బస్తీల్లో పేదలు డెంగీ, మలేరియా వ్యాధులతో మంచాన పడితే పట్టించుకునేవారే లేరు. ప్రభుత్వం జారీ చేసే జీవోలు వెబ్‌సైట్‌లో పెట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నారు.5 శాఖలు జారీ చేసిన 1400 జీవోలు వెబ్‌సైట్‌లో కనపడకుండా చేశారు. పార్టీ కార్యాలయాలకు రూపాయికి ఎకరం ఇస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అని లక్ష్మణ్‌ అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/