ఆర్టీసీ సమ్మెపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయం

TS Minster Gangula Kamalakar

KarimNagar: ఆర్టీసీ సమ్మెపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇరు పార్టీలు సంఘాలను వాడుకుంటున్నాయన్నారు. ఏపీ సీఎం మేనిఫెస్టోలో పెట్టడంతో ఆర్టీసీని విలీనం చేశారన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై బీజేపీ స్పష్టతనివ్వాలన్నారు. సీఎంపై అక్కసుతో కొన్ని పార్టీలు కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. ఆర్టీసీ సంఘాలు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/