బయోడైవర్సిటీ ప్రమాదంపై హైకోర్టు కీలకు ఆదేశాలు

Bio Diversity Flyover
Bio Diversity Flyover

హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ కారు ప్రమాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుడి తరపు న్యాయవాది రోడ్డు ప్రమాదంపై హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ప్రమాదకర మలుపు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఈ ఫ్లైఓవర్‌పై ఇద్దరు మృతి చెందారని, ఈ ప్రమాదాలకు కారణం వంతెన యొక్క మలుపేనని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తన క్లయింట్‌ 40-50 కి.మీ వేగంతోనే కారును నడిపాడని తెలిపారు. కాగా ప్రమాదం చేసిన వ్యక్తిపై సెక్షన్‌ 304(2) కింద ఏ విధంగా కేసు పెట్టారని ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. ప్రమాద సమయంలో కారును నడిపిన కృష్ణ మిలాన్‌రావు అరెస్ట్‌పై జనవరి 3 వరకు స్టే విధించింది. అప్పటి వరకు అతన్ని అరెస్ట్‌ చేయడానికి వీలులేదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవిరి 3కు వాయిదా వేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/