కేరళకు 400 క్వింటాళ్ల బియ్యం సాయం: భట్టి

Bhatti
Bhatti

కేరళకు 400 క్వింటాళ్ల బియ్యం సాయం: భట్టి

హైదరాబాద్‌ : అనూహ్య వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి వరద సహాయం కింద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ 400 క్వింటాళ్ల బియ్యాన్ని రెండు లారీలతో గురువారం పంపింది. బియ్యంతో కేరళకు వెళుతున్న లారీలకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క మల్లు జెండా ఊపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరదలతో సర్వస్వం కోల్పోయిన కేరళ వాసులకు మనవతా సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈబియ్యాన్ని సేకరించడానికి కృషి చేసిన రైస్‌మిల్లర్లతో పాటు..అందరికీ భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.