తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాజకీయ క్రీడ

bhatti vikramarka
bhatti vikramarka

Hyderabad:
తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాజకీయ క్రీడ నడుస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కలుషితమైందన్నారు. జరుగుతున్న పరిణామాలు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారన్నది ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. ఈరోజు జరిగే సీఎల్పీ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు.