భక్తులపై ఎలుగుబంటి దాడి

Bear Attack
Bear Attack

Nizamabad: భక్తులపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ని మండలం బడాపహాడ్‌కు వచ్చిన భక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. దాడిలో నలుగురు భక్తులకు స్వల్ప గాయాలు కాగా హైదరాబాద్‌కు చెందిన జహంగీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు.