కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం

Batti Vikramarka withMedia
Batti Vikramarka withMedia

Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరుగుతోందని తాము మొదటి నుంచి చెప్తున్నామని టీ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ…. రూ.28వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచారన్నారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లిలోకి ఎన్ని టీఎంసీల నీరు పంపింగ్ చేశారని ఆయన ప్రశ్నించారు. పంపింగ్ చేసిన దానికంటే కిందకు వదిలిన నీరే ఎక్కువ అన్నారు. కాళేశ్వరం టెండర్ల దశ నుంచే భారీగా అవినీతి జరిగిందన్నారు. రూ.1500 కోట్లతో పూర్తయ్యే సీతారామ ప్రాజెక్టును రూ.15వేల కోట్లకు పెంచారన్నారు. తెరాస పథకాలపై విచారణ జరిపించాలని అమిత్ షాను కోరతామన్నారు. తెరాసతో భాజపాకు ఒప్పందం లేకుంటే.. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. తెరాసకు కేంద్రంలోని భాజపా ఐదేళ్ల పాటు సహకరించిందన్నారు. ఇప్పుడేమో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ భాజపా అంటోందన్నారు.