త్వరలో బిజెపిలోకి టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎంపీలు!

దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు

Bandaru Dattatreya
Bandaru Dattatreya

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఎంపీలు త్వరలో తమ పార్టీలో చేరబోతున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్‌ నేత దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన దత్తన్న..మీడియాతో మాట్లాడుతూ…టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియేనని అభిప్రాయపడ్డారు. కవిత, వినోద్‌ ఓటమితో కేసిఆర్‌ పతనం ప్రారంభమైందని అన్నారు. డిఎస్‌తో పాటు చాలా మంది నేతలు త్వరలోనే బిజెపిలో చేరుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించారు. తెలంగాణలో రెవెన్యూ శాఖతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందని దత్తాత్రేయ ఆరోపించారు.
దక్షిణాదిన పాగా వేయాలని చూస్తున్న బిజెపికి గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రావడంతో రాజకీయాలను శాసిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో కుంపటి పెట్టి తమాషా చూస్తుంది. గోవాలో పది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిజెపిలో కలిసిపోయారు. ఇక ఏపి, తెలంగాణలో కూడా ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించే పనిలో బిజెపి నేతలు ఉన్నట్లు తెలుస్తుంది.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/