భద్రాచలాన్ని ఏపిలో విలీనం..అంగీకరించిన కెసిఆర్‌?

cm kcr
cm kcr

హైదరాబాద్‌: తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలాన్ని త్వరలోనే ఏపిలో విలీనం చేయనున్నారనే ప్రచారం ఇప్పుడు మళ్లీ వచ్చింది. అయితే ఇటివల రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో తెలంగాణ సిఎం కెసిఆర్‌, ఏపి సిఎం జగన్‌ సమావేశం సందర్భంగా ఈ విషయం చర్చకు రాగా, సిఎం కెసిఆర్‌ అందుకు అంగీకరించినట్టు సమాచారం. కాగా ఇప్పుడు భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేసే విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు 2014లో ఏపీలో విలీనమైన విషయం తెలిసిందే.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/