వరంగల్‌కు రావడం ఆనందంగా ఉంది

కాకతీయులు నిర్మించిన చెరువులను కాపాడుకోవాలి

venkaiah naidu
venkaiah naidu

వరంగల్‌: ఆంధ్ర విద్యావర్ధిని (ఏవీవీ) విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..వరంగల్‌ అంటే ఎంతో ప్రేమ, అనుబంధం ఉంది. విద్య, సాహిత్య, సాంస్కృతిక కేంద్రమైన వరంగల్‌కు రావడం ఆనందంగా ఉందని అన్నారు. కాకతీయులు నిర్మించిన చెరువులను కాపాడుకోవాలి. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని తెలిపారు. మాతృభాషను జన్మభూమిని మరచిపోవద్దు. మాతృభాషలోనే ప్రాథమక విద్యాభ్యాసం జరగాలి. పరిపాలనా భాషగా మాతృభాష ఉండాలని వెంకయ్యనాయుడు అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/