కార్ఖానా రహదారిలో ఏటీఎం లో సీసీకెమెరా చోరీ

Atm Centre
Atm Centre

Hyderabad:  ఏటీఏం సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి సీసీకెమెరా చోరీ చేశాడు. కార్ఖానా ప్రధాన రహదారిలోగల కొటక్‌ మహీంద్రా ఏటీఎం సెంటర్‌లోకి ఈనెల 8వ తేదీ తెల్లవారు జామున 3గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వెళ్లాడు. అందులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా, మోడమ్‌ను అపహరించాడు. సెక్యూరిటీ ఇన్‌చార్జి ఫిర్యాదు మేరకు కార్ఖానా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.