ఎంపి అసదుద్దిన్‌ సహ మజ్లిస్‌ నేతల నివాళి


విద్యానగర్‌,: ఎంఐఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బహుదూర్‌యార్‌ జంగ్‌ 70వ వర్థంతిని పురస్కరించుకుని ఆయన సమాది వద్ద హైదరాబాద్‌ ఎంపి, ఎంఐఎం అదినేత అసదుద్దీన్‌ ఓవైసి నివాళులర్పించారు. ముషీరాబాద్‌ దాయరకమాన్‌లో ఉన్న సమాది వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమానికి ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి అసదుద్దీన్‌ హజరయ్యారు. ప్రత్యేక పార్థనల అనంతరం బహుదూర్‌యార్‌ జంగ్‌ సమాదిపై చాదర్‌ కప్పి పుష్పాలంకరణ చేశారు. సమాది వద్ద బహుదూర్‌ జంగ్‌కు నివాళులర్పించిన తదుపరి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు పాషాఖాద్రీ,కౌసర్‌ మోహనుద్దీన్‌, మోజంఖాన్‌, ముంతాజ్‌ఖాన్‌, కార్పొరేటర్లు అఖిల్‌ అహ్మద్‌, సోహెల్‌ఖాద్రి మహ్మద్‌నసీర్‌, సయ్యద్‌ మోహిద్దీన్‌, టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల హరిబాబుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

https://www.vaartha.com/telengana/
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: