సంగీత నృత్య కళాశాలలో దరఖాస్తులు

music-dance
music-dance

హైదరాబాద్‌: 2019-20 సంవత్సరానికి గానూ రాంకోఠిలోని త్యాగరాజ ప్రభుత్వ నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎన్‌ సుధీర్‌ కుమార్‌ పేర్కొన్నారు. కర్ణాటక గాత్రం,హిందుస్థాని గాత్రం, కర్ణాటక వయోలిన్, హిం దు స్థాని వయోలిన్, వీణ, సితార్, మృదంగం, వేణువు, తబల, డోలు, కూచి పూడి నృత్యం,భరతనాట్యం,పేరిణీ నృత్య ం,కథక్ నృత్యం తదితర కోర్సు లలో శిక్షణ నిమిత్తం ధరాఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తరగతు లను నిర్వహించడం జరుగుతుందన్నారు. అయితే ఆసక్తి గల అభ్యర్థులు రాంకోఠిలోని కళాశాల కార్యాలయంలో 25 రూపాయలు చెల్లించి దరాఖాలస్తు ఫారాలను పొందాలన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/