తెలంగాణకు ఏపి భవనాల అప్పగింత పూర్తి

ap blocks
ap blocks


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి ఏపి సచివాలయ భవనాల అప్పగింత పూర్తయింది. బుధవారం కె బ్లాక్‌, సౌత్‌, హెచ్‌ బ్లాక్‌లు అప్పగించగా గురువారం జె, ఎల్‌ భవనాలను అప్పగించారు. సచివాలయ భవనాల అప్పగింతను జిఏడి అధికారులు పరిశీలించారు. ఫైళ్లు, ఇతర సామగ్రి అప్పగింతను సిబ్బంది వీడియో రికార్డింగ్‌ చేశారు. విభజనలో భాగంగా హైదరాబాద్‌లో ఏపికి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉందడంతో ఇటీవల ఇరు రాష్ట్రాల సియంలు చర్చించుకుని నిర్ణయం తీసుకున్నారు. ఏపి సియం జగన్‌ చొరవతో ఏపి భవనాలు తెలంగాణకు అప్పగించే ప్రక్రియ గురువారం పూర్తి చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/