మరో ఆహ్వానం అందుకున్న కెటిఆర్‌

K. T. Rama Rao
K. T. Rama Rao

హైదరాబాద్‌: తెలంగాణ పరిశ్రమల, ఐటి శాఖల మంత్రి కెటిఆర్‌కు మరో ఆహ్వానం అందిది. ఆస్ట్రేలియా-ఇండియా లీడర్‌షిప్‌ సదస్సుకు ఆయనకు హాజరుకావాలని ఆహ్వానం వచ్చింది. కెటిఆర్‌కు ఇప్పటికే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి ఆహ్వానం వచ్చిన విషయం విదితమే. ఈ సదస్సులో వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించనున్నారు. ఆస్ట్రేలియా, ఇండియాకు సంబంధించిన కీలక వ్యాపార, వాణిజ్య రంగాల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. కాగా స్విట్టర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే సమావేశాల్లో విశిష్ఠ అతిథిగా పాల్గొని ప్రసంగించాలని కెటిఆర్‌ను వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ప్రత్యేకంగా కోరింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/