సునీల్‌కు నియామకపత్రం అందజేస్తున్న అంజన్‌ కుమార్‌

 Anjan Kumar, Sunil
Anjan Kumar, Sunil

విద్యానగర్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌. సునీల్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శిగా సునీల్‌కు నియామక పత్రం అందించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని అడిక్‌మెట్‌ డివిజన్‌కు చెందిన సునీల్‌ కుమార్‌ దశాబ్దకాలంనుంచి కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ ఎన్నికల పరిశీలకుడిగా పనిచేయడంతో పాటు లండన్‌లో యువజన కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగంలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గాంధీ భవన్‌లో పార్టీ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డీనేటర్‌గా ఉన్న ఆయనను గ్రేటర్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ కార్యకర్తలతోకలిసి పోరాడుతామని ఆయన తెలిపారు.