సోనీ నాయక్‌ ఇంటికి చేరుకున్న అమిత్‌షా

Amit Shah
Amit Shah

హైదరాబాద్‌: కేంద్రమంత్రి అమిత్‌షా సోనీ నాయక్‌ అనే బిజెపి కార్యకర్త ఇంటికి చేరుకుని ఆమెకు స్వయంగా తానే బిజెపి సభ్యత్వం ఇచ్చారు. అనంతరం ఆమె ఇచ్చిన తినుబండాలను ఆప్యాయంగా ఆయన తిన్నారు. అంతేకాదు సోనీ నాయక్‌ ఇంట్లో తేనేటి విందు స్వీకరించారు. తరువాత ఆమె తన కుటుంబసభ్యులను అమిత్‌షాకు పరిచయం చేశారు. సోనీ తన ఇంట్లో ఉన్న ఫొటోలను అమిత్‌షాకు చూపెడుతూ వాటికి సంబంధించిన వివరాలు చెప్పారు.సోనీ నాయక్‌ స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం తిరుమలగిరి. 35 ఏళ్ల క్రితం భర్త కిషన్‌తో వచ్చి బాలాపూర్‌ మండలం మామిడిపల్లి సమీపంలోని రంగనాయక తండాలో స్థిరపడింది. భార్యాభర్తలు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఆమె చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/