ఎసిబికి పట్టుబడ్డా విద్యుత్‌ ఎఇ

acb
acb

హైదరాబాద్‌ : నగరంలోని యూసుఫ్‌గూడ పరిధిలో పని చేస్తున్న ఓ విద్యుత్‌ ఎఇ లంచం పుచ్చుకుంటూ ఎసిబికి నేరుగా పట్టుబడ్డాడు. విద్యుత్‌ మీటర్‌ ను బిగించేందుకు ఎఇ సుధాకర్‌ ఓ వ్యక్తి నుంచి రూ. 60 వేలను లంచంగా డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు బాధిత వ్యక్తి ఎసిబిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో సుధాకర్ మొదటి విడతగా సదరు వ్యక్తి నుంచి రూ.35 లంచంగా తీసుకుంటుండగా వలపన్నిన ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో సుధాకర్ ను అరెస్టు చేశారు. ఆయన కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. లంచం తీసుకున్నా, ఇచ్చినా నేరమని, లంచం అడిగే ప్రభుత్వ ఉద్యోగుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని ఎసిబి అధికారులు ప్రజలను కోరారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/