ఆర్టీసి కార్మిక నేతలకు విధుల మినహాయింపు రద్దు

ashwathama reddy
ashwathama reddy

హైదరాబాద్‌: బస్సు భవన్‌లోని అధికారిక కార్మిక సంఘమైన టీఎంయూ కార్యలయానికి యాజమాన్యం తాళం వేశారు. ఆర్టీసి కార్మిక నేతలు కూడా ఇప్పటి నుంచి సాధారణ కార్మికుల మాదిరిగానే విధులు నిర్వహించాల్సిందేనని తెలిపారు. ఇప్పటివరకూ వారికి కల్పించిన రిలీఫ్‌ (విధులు నుంచి మినహాయింపు) హక్కులను యాజమాన్యం రద్దు చేసింది. దీని ప్రకారం ఆర్టీసి కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితో సహా యునియన్‌ నేతలంతా డ్యూటీలు చేయాలి. ఇతర కార్మికుల మాదిరిగానే వారందరు విధులకు హాజరు కావాలి లేకుంటే గైర్హాజరుగా పరిగణిస్తారు. మొత్తం 30 మంది కార్మిక నేతలకు ఇప్పటి వరకు డ్యూటీ మినహాయింపు ఉండేది. ఇందులో అధికారిక కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ)కు చెందిన వారు 26 మంది ఉన్నారు. ఇంకా కార్మికుల నుంచి యూనియన్‌ సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి కూడా త్వరలో చెక్‌ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసి యూనియన్లు ఉండకూడదని అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/