రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజూ నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

Aarogyasri
Aarogyasri

హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణలో వరుసగా నాలుగో రోజు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా డయాలసిస్‌ నుంచి గుండెకు స్టంట్‌ వరకు వివిధ సమస్యలకు వేలాది మంది రోగులు ఖరీదైన సేవలను ఉచితంగా పొందుతున్నారు. అయితే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడంలేదంటూ గురువారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేశారు.గుండె, కిడ్నీ రోగులకు అత్యవసరంగా పేర్కొనే రక్తమార్పిడి ప్రక్రియను సైతం అందించడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. డిమాండ్‌లు పరిష్కరిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్పష్టం చేశాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/