తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

Aarogyasri
Aarogyasri

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు నుండి బంద్‌ కానుంది. 242 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. కాగా ఈ పథకానికి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు సర్కారు చెల్లించకపోవడంతో పథకానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్లులు ఎప్పుడు వస్తాయంటూ.. కొంతకాలంగా ఎదురు చూసిన ప్రైవేట్‌ ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ప్రైవేట్‌ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా వారి బిల్లులు మంజూరు కాకపోవటంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నారు.
కాగా ప్రభుత్వం ముందు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రి యాజమాన్యాలు నాలుగు డిమాండ్లు పెట్టాయి. రూ. 1500 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/