మహిళా ఎస్‌ఐతో అసభ్యంగా ప్రవర్తించిన పూజారి

Thousand Pillar Temple, Warangal
Thousand Pillar Temple, Warangal

వరంగల్‌: జిల్లా కేంద్రంలోని వేయి స్తంభాల గుడిలో మహిళా ఎస్‌ఐ పట్ల పూజారి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా అలజడి రేపింది. గుడిలోనే మహిళా ఎస్‌ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శివరాత్రి సందర్భంగా మహిళా ఎస్సై గుడికి వచ్చింది. ఆ సమయంలోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఎస్‌ఐ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/